జగన్ అన్న ని ముఖ్యమంత్రి చేసి …గుండె ఫై చేయీ వేసుకొని రాష్ట్ర ప్రజలు నిద్ర పోతారు : నాని

జగన్ అన్న ని ముఖ్యమంత్రి చేసి …గుండె ఫై చేయీ వేసుకొని రాష్ట్ర ప్రజలు నిద్ర పోతారు.

The Leader

Y.S. Rajasekhara Reddy (8 July 1949 – 2 September 2009), popularly known as YSR, was a two-time Chief Minister of the Indian state of Andhra Pradesh, serving from 2004 to 2009. He has been viewed as the most popular chief minister of Andhra Pradesh.His popularity is often attributed to the welfare schemes and development programs he championed for the people of his state. The BBC, for instance, called him a champion of social welfare schemes.

Reddy was elected to the 9th, 10th, 11th, and 12th Lok Sabha from the Kadapa constituency for four terms and to the Andhra Pradesh Assembly for five terms from the Pulivendula constituency. He won every election he contested.In 2003 he undertook a three-month-long paadayaatra, or walking tour of 1475 km during the very hot summer months, across several districts in Andhra Pradesh as a part of his election campaign. He led his party to victory in the following general and assembly elections held in 2004, and did the same in 2009. He is the only chief minister of the state to have served again after a full term.

we want Back YSR Schems..Only JAGAN will do…

మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి బడుగు, బలహీనవర్గాల కోసం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలన్నింటినీ ఎత్తివేసేందుకు కాంగ్రెస్, టీడీపీలు కుట్ర పన్నుతున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభా పక్షం ఉప నాయకురాలు భూమా శోభానాగిరెడ్డి ధ్వజమెత్తారు. వైఎస్ పథకాలను ఒక్కొక్కటిగా తుంగలో తొక్కుతూ ప్రజలు ఆయన్ని మర్చిపోయేలా చేసేందుకు యత్నిస్తున్నాయన్నారు. ఫీజుల పథకాన్ని నీరుగార్చేందుకే మంత్రివర్గ ఉపసంఘం పేరుతో ప్రభుత్వం డ్రామా ఆడుతోందన్నారు.

సంక్షేమ పథకాలను ఎత్తివేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే, అందుకు టీడీపీ సహకరిస్తోందని చెప్పారు. ఇదంతా ఒక కుట్ర ప్రకారం జరుగుతోందన్నారు. ఫీజుల పథకాన్ని తానే ప్రవేశపెట్టానని చెప్పుకొంటూ చంద్రబాబు పచ్చి అబద్ధాలు ఆడుతున్నారన్నారు. ఆయన హయాంలో బీసీ, మైనారిటీ విద్యార్థులకు రూ.300 ముష్టిగా మాత్రమే ఇచ్చారని గుర్తుచేశారు. మజ్లిస్ నేత అక్బరుద్దీన్ ఒవైసీ కూడా ఈ విషయాన్ని అసెంబ్లీలో ఉదహరించారని తెలిపారు.

సోనియాను విజయమ్మ కలిసినట్లు నిరూపిస్తారా?
తమ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ.. సోనియాగాంధీని కలిసినట్లు రుజువు చేస్తే పార్టీ ఎమ్మెల్యేలందరూ శాశ్వతంగా రాజకీయాల నుంచి వైదొలుగుతామని, నిరూపించలేకపోతే చంద్రబాబు ఒక్కరు రాజకీయాల నుంచి తప్పుకుంటే చాలని శోభా నాగిరెడ్డి సవాలు విసిరారు.

నేడు జిల్లాల్లో ధర్నాలు
ఫీజుల పథకంపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో గురువారం ఉదయం 10.30కు అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు, రాజధానిలో ఉన్నత విద్యా మండలి కార్యాలయం వద్ద ధర్నాలు చేపడుతున్నట్టు పుత్తా ప్రతాపరెడ్డి తెలిపారు.